హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం సమీక్ష
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. గతంలో భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతి, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు, పట్టణంలో కొనసాగుతున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తరి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.