లెజెండరీ కెయూ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో,తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, రక్తం అవసరం ఉన్న వారి కోసం లెజెండరీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్,ప్రధాన కార్యదర్శి అర్షం సదానందం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పరకాల ఆర్డీవో డీఎస్. వెంకన్న, కేయూ పాలక మండలి సభ్యులు చిర్ర రాజు గౌడ్ హాజరై ప్రారంభించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయిందని అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న అన్నారు.ప్రతిఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు చేసిన వారం అవుతామని తెలిపారు. ఈ సందర్భంగా లెజెండరీ కేయూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు 52 మంది పాల్గొని రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ బూర రాజగోపాల్ గౌడ్,హనుమకొండ జిల్లా ఫిషెరీష్ డిపార్ట్మెంట్ ఎడి.పిల్లి శ్రీపతి, లెజెండరీ కేయూ వాకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అర్షం సదానందం, ఉపాధ్యక్షుడు తుపాకుల రవి,ఆర్గనైజింగ్ సెక్రటరీ పస్తం అనిల్,నామసాని నాగరాజు యాదవ్, బండారి వేణు, ఏరుకొండ పవన్ గౌడ్, రమేష్, వెంకటేశ్వర్లు,బాలు నాయక్,దండే రఘు, అనురామ చౌదరి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.