శ్రీ శీతల పరమేశ్వరి( బొడ్రాయి) కట్ట మైసమ్మ శ్రీ ఆంజనేయస్వామి పునప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శీతలా పరమేశ్వరి (బొడ్రాయి), కట్టమైసమ్మ , శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభంఅనిల్ కుమార్ రెడ్డి, కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి దేవతామూర్తుల పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే  దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే  తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shri-sheetala-parameshwari-bodrai-katta-maisamma-mla-who-participated-in/article-15179

Tags: