జర్నలిస్టు కొండ మల్లేశం గౌడ్ కు డాక్టరేట్
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిదానపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు, ప్రముఖ జర్నలిస్టు కొండ మల్లేశం గౌడ్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ మేరకు శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు అవార్డు ప్రధానం చేసారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ (హానొరిస్ ఇన్ కాస)తో పాటు జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. లారీ క్లీనర్‌గా ప్రారంభమైన మల్లేశం గౌడ్ జీవన ప్రస్థానం నేడు జర్నలిస్టుగా, సామాజిక సేవకుడిగా, పత్రికా వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందింది. డ్రైవర్‌గా పనిచేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించి ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పట్టాలు సాధించారు. జై గౌడ, ప్రజా కలం, లోకల్ టైమ్స్, తేజా టీవీ, సుదినం తదితర మీడియా సంస్థల్లో పనిచేసిన ఆయన, అనంతరం ప్రజల సమస్యలకు వేదికగా "స్థానికం" పత్రికను స్థాపించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా 49 మంది యువకులకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. "చదువు–వెలుగు" కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు విద్యాబోధన, ఉచిత ఆరోగ్య శిబిరాల నిర్వహణ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక సేవ, విద్యా చైతన్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.