కాంగ్రెస్ కు తగిన బుద్ది చెబుతారు : రాంబాబు యాదవ్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని బీఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల విషయంలో మాట తప్పిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు. గురువారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి బీఆర్ యు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాంబాబు యాదవ్ మాట్లాడుతూ... లేబర్ కోడ్ల అమలుకై కార్మిక శాఖ నిర్వహించిన సమావేశాన్ని తాము బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. నరేంద్రమోడీ బాటలోనే రేవంత్రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించిందని అన్నారు. కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్లను వెనక్కితీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె. నారాయణ, వేముల మారయ్య, టివి లక్ష్మణ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.