ప్రజా పాలన దరఖాస్తుల తప్పులకై సేవా కేంద్రం

WhatsApp Image 2024-07-23 at 16.01.04_b559c25e

విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - ప్రజాపాలన దరఖాస్తులు తప్పులను సరి చేసేందుకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం జి8, మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అయన తనిఖి చేసి పోర్టల్ లో తప్పులను సరి చేయు విధానాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం,  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  గతంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు సంక్షేమ పథకాలు లబ్ధికి ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారని, అట్టి లబ్ధిదారులు దరఖాస్తుల్లో ఉన్న తప్పులను  
సరిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.  ప్రజలు ఈ యొక్క సేవా కేంద్రాలలో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవాలని ఆయన సూచించారు.
 ఈ కార్యక్రమంలో సిపిఓ శామ్యూల్,  ఈడియం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Read More పార్టీ కార్యాలయం పై దాడి సిగ్గుచేటు: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.