ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం

విశ్వంభర,  ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ తోటి బాలబాలికలకు పాఠాలు బోధించారు. అనంతరం హెచ్ ఎం  వీరన్న నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఇనుగుర్తి, చీన్య తండా సర్పంచులు తమ్మడపల్లి కుమార్, జాటోతు హరిచంద్ నాయక్ హాజరై మాట్లాడుతూ,  సమాజ నిర్మాతలైన గురువుల పాత్ర చిన్న వయసులోనే  పోషించి పాఠాలు బోధించడం అభినందనీయమని విద్యార్థులకు కితాబిచ్చారు. సర్పంచి హరిచంద్ నాయక్ డొనేట్ చేసిన బహుమతులను విద్యార్థులకు అంద చేశారు. అనంతరం సర్పంచులు కుమార్,హరిచంద్ నాయక్ లను హెచ్.ఎం వీరన్నతోపాటు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది. స్వయం పాలనలో ఎంఈఓ గా సిద్దు,హెచ్ఎం ఈ.నీరజ్,సర్పంచి ఎం. శివచరణ్,స్కూల్ చైర్మన్ ఎండి సోనీ,రైతులుగా వి. వరుణ్,జి.సుశాంత్ లతోపాటు మరికొందరు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.కార్యక్రమంలో నాయకులు రహీం,ఉపాధ్యాయులు వెంకటేశ్వరచారి,రేవతి,వైడూర్యం, బాలరాజు,దద్దు యాకయ్య,నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Tags: