పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా యేవురీ
విశ్వంభర, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా యేవురీ శివానందం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్‌గా మాదాసు రాజశేఖర్ కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యేవురీ శివానందం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతోందని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ టాటా శ్రీనివాస్ గౌడ్ ఆశీస్సులతో తనకు ఈ పదవి దక్కడం సంతోషంగా ఉందని, తనపై నమ్మకం ఉంచిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మంత్రుల సమక్షంలో అధికారికంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.అనంతరం.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే నాయకులకు పదవులు దక్కడం హర్షణీయమన్నారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఘనంగా సన్మానించేందుకు భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంద్రేశం కౌన్సిలర్ శివ గౌడ్, నాయకులు పాటి గోపాల్ యాదవ్,మారగారి శ్రీనివాస్ , ఉస్మాన్ నగర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, భానూర్ గ్రామసర్పంచ్ శాంతయ్య, నందిగామ సర్పంచ్ ఎల్లగొని విక్రమ్ గౌడ్ తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



