వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం
On
విశ్వంభర, పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చిన్న రాములు, కౌన్సిలర్లు వెంకటేష్,ఆంజనేయులు,నాగభూషణం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



