జర్నలిస్ట్ నజీర్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్

జర్నలిస్ట్ నజీర్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్

విశ్వంభర, హైదరాబాద్: పత్రికారంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ జర్నలిస్ట్ నజీర్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్, చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా అందజేశారు. సూర్యాపేట ప్రాంతంలో జర్నలిజం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నజీర్ ఖాన్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అవార్డు కార్యక్రమం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి సెక్రటరీ డాక్టర్ కాశీనాథ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ సరిత మాలో, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో చీఫ్ అడ్వైజర్, జిహెచ్ఎంసి బీజేపీ నాయకుడు గూడూరి శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఎంఈఓ డాక్టర్ కస్నా నాయక్, సినీ నటుడు మల్లం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: