విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ 

విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ 

విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పదవ తరగతి పరీక్షల సందర్భంగా స్ట్రెంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బత్తిని రాజు ఆర్థిక సహకారంతో ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థినులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. స్ట్రెంత్ ఫౌండేషన్ ఫౌండర్  చైర్మన్ ఎర్ర నరేష్ మాట్లాడుతూ, విద్యార్థినులు కష్టపడి చదవాలని, విద్యే మనిషికి నిజమైన సంపద అని అన్నారు. పరీక్షలను ధైర్యంగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్ట్రెంత్ ఫౌండేషన్ సభ్యులు బత్తిని రాజు, ఆవుల సాయి, ఆవుల మత్స్యగిరి, అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags: