పెండింగ్ పనులు పూర్తి చేయాలి
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని భారతినగర్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అండర్ డ్రైనేజ్ పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని కలిసి సమస్యపై చర్చించారు.ఈ సందర్భంగా భారతినగర్ డివిజన్‌లోని ఫెన్సింగ్ ఏరియా, ఎంఐజీ కాలనీ ప్రాంతాల్లో అండర్ డ్రైనేజ్ పైప్‌లైన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. చాలా కాలంగా పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వెంటనే ఈ పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న అండర్ డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎండీని కోరారు.దీనిపై స్పందించిన ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



