కాంగ్రెస్ నాయకుడికి ఆర్థిక సహాయం
On
విశ్వంభర, బాగ్ అంబర్‌పేట: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 'ఎ' బ్లాక్ అధ్యక్షుడు కె. రాజేశ్వర్‌రావుకు కాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ మంత్రి వి. హనుమంతరావు సూచనతో పుల్లా నారాయణ స్వామి రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్, తాల్లా రోహిత్, కుంకుమ చంద్రశేఖర్ పాల్గొన్నారు.



