పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ 

పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ 

విశ్వంభర, చేవెళ్ల: రేపటి నుండి ప్రారంభమయ్యే ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి విజయాన్ని సాధించాలని చేవెళ్ల బీజేపీ యువ నాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి ఆకాంక్షించారు. జీవితంలో మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయాలు లేకుండా ధైర్యంగా , ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని ఆయన సూచించారు. కష్టపడి చదివిన విద్యకు తగిన ఫలితం తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ వైభవ్ రెడ్డి ఆకాంక్షిస్తూ  విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Tags: