సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామం 2వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు మాట్లాడుతూ,  గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి, అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాసరెడ్డి, సహాయ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పధంలో నిలపనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సీసీ రోడ్డుశంఖుస్థాపన కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి సౌమ్య, 2వ వార్డు సభ్యురాలు బుర్రా, భవానీ. మాజీ పిఎసిఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు గద్దె రఘు, కొల్లు సుబ్బారావు, చుండూరు మురళి, గుండ్లపల్లి వెంకన్న, దాములూరి మురళి, బుర్రా నాగమల్లేశ్వరరావు,నేరెళ్ళ నాగేశ్వరరావు, మేళ్ళచెర్వు చిన బిక్షం, గ్రామశాఖ అధ్యక్షుడు కంటు వేణు, తదితరులు పాల్గొన్నారు.

Tags: