విద్యార్థుల కు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ
విశ్వంభర, కేసముద్రం: వేం చారిటబుల్ ట్రస్ట్, కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో, కల్వల మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కు రైటింగ్ ప్యాడ్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ, మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మ స్టైర్యం తో ఉండాలని, మానవ ప్రయత్నం లో ఎలాంటి లోపం లేకుండా ఉంటే దానికి ఫలితం అనుకూలంగా ఉంటుందని, సానుకూలంగా, పాజిటివ్ ఆలోచన ధోరణి కలిగి ఉండాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గౌరవించాలని సమాజం లో ఉత్తమ పౌరులు గా ఎదగాలి అని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ పరిమి నవీన్, రావుల మురళి,ఉపసర్పంచ్ పెదగాని రవి, గ్రామపంచాయతీ కారోబారి నాగరాజు, ఉప సర్పంచి, గండి శీను, జయేందర్ ఉపాధ్యాయులు మద్దినేని వీరబాబు, పార్థసారథి, యాకయ్య , రమేష్, దుర్గాప్రసాద్, శ్రీదేవి, హెల్త్ కేర్, ప్రవళిక, నరసయ్య, సోమయ్య, చంద్రశేఖర్, చంద్రమోహన్, విద్యార్థులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



