సదాశివపేట కౌన్సిలర్లతో మంత్రి భేటీ
On
విశ్వంభర, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట్ స్వామిని సదాశివపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి నేతృత్వంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిర్రు సహా కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పేదల గృహనిర్మాణ పథకాలు వేగవంతం చేయాలని కోరారు. మంత్రి వారి ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.



