ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ

ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట నారాయణ  జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్  పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని పలు తరగతి గదులలో పరీక్ష జరుగుతున్న తీరును కలెక్టర్  పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘాలో  ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసి ఇన్విజిలేటర్లకు అందజేసే  గదిని కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో పరీక్షల నిర్వహణ సజావుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, పరీక్షల నిర్వహణకు సంబంధించిన  పలు సూచనలను  కలెక్టర్ చేశారు.

Tags: