ఉపాధి హామీ పనుల పరిశీలన 

ఉపాధి హామీ పనుల పరిశీలన 

విశ్వంభర,ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం మోర్పిరాల గ్రామ పంచాయతీలో బుధవారం ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఏపిఓ రమేష్  పరిశీలించారు. ఈ సందర్భంగా అయన  కూలీలతో మాట్లాడుతూ,  ఎండలు ఎక్కువగా ఉంటున్నందున ప్రతి వ్యక్తి సరిపడే మంచి నీరు తెచ్చుకోవాలని సూచించారు. పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. కూలీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టీఏ డి శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి నాగుల రాఘవేందర్, సీనియర్ మేట్ కొంతం గోపి రెడ్డి పాల్గొన్నారు.

Tags: