అనంతారం స్కూల్ కు కాంస్య పతకం
On
విశ్వంభర, మహబూబాబాద్: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో మహబూబాబాద్ శివారు అనంతారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటి కాంస్యపతకాన్ని సాధించారు . 9వ తరగతి కి చెందిన బాలికలు హిందూ,లాస్య ప్రియ సంబంధిత పోటీలలో అసాధారణ ప్రతిభ కనబరిచి కాంస్య పతకంతో పాటు, రూ.15 వేల నగదును ప్రముఖుల చేతుల మీదుగా పొందారు . అనంతారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు మాట్లాడుతూ, విద్యార్థినిలు స్టేట్ లెవెల్ లో రాణించి తమ ఆదర్శ పాఠశాల గొప్పతనాన్ని రాష్ట్రస్థాయిలో చాటారన్నారు. ప్రిన్సిపాల్ తో పాటు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సింధు వర్మ, కోచ్ జావిద్ ఉపాధ్యాయ బృందం విజేతలైన హిందూ లాస్యప్రియ లను అభినందించారు .



