అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

విశ్వంభర, కాచిగూడ : హర్యానా, ఢిల్లీ నుంచి హైదరాబాదుకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను కాచిగూడ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీలలో రూ.54,810 విలువ గల 21 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్యం అక్రమ రవాణాపై కాచిగూడ ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీలలో మద్యం పట్టుబడింది. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీధర్, ఎస్సైలు ధనరాజ్ గౌడ్, భవానీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Tags: