ఇన్‌స్టాలో మోడీ క్రేజ్‌.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు

ఇన్‌స్టాలో మోడీ క్రేజ్‌.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్‌ రోజురోజుకి పెరిగిపోతోంది. బయటే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటింది. ప్రపంచంలో ఇంతమంది ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. 2014 నుంచి మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగించడం ప్రారంభించారు. మరో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇప్పటికే ఆయనను అనుసరించే వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే.. మోదీ ఫాలోవర్ల సంఖ్య రెండు రెట్లు ఎక్కువ. 4.3 కోట్ల మంది ఫాలోవర్లతో ట్రంప్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా (1.4 కోట్ల మందికి పైగా), తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ (1.1కోట్లు), అర్జెంటీనా అధ్యక్షుడు హవియేర్‌ మిలే (64 లక్షలు) ఉన్నారు. ఇక, కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 కోట్లు మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'
సీఎం రేవంత్ కు  బహిరంగ లేఖ రాసిన  CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .
సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి
ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ