ఘనంగా భోగ్ బండార్ 

ఘనంగా భోగ్ బండార్ 

విశ్వంభర, మహబూబాబాద్ :  జిల్లా కేంద్రంలోని  పత్తిపాక రోడ్డులో ఉన్న  ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని గురువారం భోగ్ బండారు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బానోతు కిషన్ సద్గురు సేవాలాల్ భోగ్ బండార్ ప్రసాదాన్ని విద్యార్థులకు అందజేశారు .అనంతరం  కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రధానోపాధ్యాయులు కిషన్ నాయక్  మాట్లాడుతూ,  సంత్ సేవాలాల్ మహారాజ్ తన జీవితాన్ని గోరు బంజారా జాతి నిర్మాణం కోసం, జాతీయ ఐక్యత కోసం ధారపోశాడన్నారు .  ఆయన సేవా దృక్పథం, సమాజానికి చూపిన సన్మార్గం చాలా గొప్పదని వారి అడుగుజాడల్లో నడిచి భావిభారత నవ సమాజాన్ని నిర్మించడంలో మనమందరం అంకితం కావాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాఠశాల వార్డెన్ లక్ష్మీ నర్సు ,పాఠశాల ఉపాధ్యాయులు రామ్ దాస్ ,వీరు ,రమేష్, సమ్మయ్య, దేవుల , విద్యార్థులు , సిబ్బంది పాల్గొన్నారు .

Tags: