ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్
విశ్వంభర, సరూర్ నగర్ : లింగోజిగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి , డైరెక్టర్ ఆలపాటి శైలజ కామేశ్వర్ రావు , అకాడమిక్ డైరెక్టర్ బాలాజీ ప్రారంభించారు. సుమారు 20 స్కూల్స్ నుండి 45 టీమ్స్,, 350 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.సాయంత్రం విజేతల కు డైరెక్టర్ కామేశ్వర్ రావు గారు ట్రోఫీలు , రోలింగ్ షీల్డ్ అందజేశారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తీ పెంపొందిoచాడానికి ఈ టోర్నమెంట్ లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలియజేశారు. ప్రిన్సిపల్ రామారావు మాట్లాడుతూ, ఈ ఆట పోటీలకు అనుకున్న టీం ల కన్నా ఎక్కువ టీమ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిఇటీ సూరారం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా , అండర్ 17 బాలురు కప్ ను మాస్టర్ మైండ్స్ గెలుపొందగా, అలియా నిర్మల్ స్కూల్ బాలికల కప్ గెలుచుకున్నారు. అండర్ 14,అండర్ 12 లలో విజేతలు గా కృష్ణవేణి టాలెంట్ స్కూల్, లింగోజిగూడ బ్రాంచ్ గెలిచింది.



