వాలీబాల్ విజేతలకు బహుమతులు
On
విశ్వంభర, సంగారెడ్డి: జిన్నారం మండల పరిధిలోని బీసీ కాలనీలో శివరాత్రి జాగారం సందర్భంగా యూత్ సభ్యులు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టుకు జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి రూ.20,000 నగదు ప్రైజ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని, క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. పండుగ పూట ఇలాంటి పోటీలు నిర్వహించి ఐక్యతను చాటడం సంతోషకరమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, యూత్ సభ్యులు నందు, సాయి, గౌస్, లడ్డు, ఘని, సంజు, సాయితో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



