సమస్యల పరిష్కారమే లక్ష్యం
On
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిర్మల్‌కు చెందిన ఎంసీ లింగన్న ఎన్నికయ్యారు. ఆయన మూడు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఎంసీ లింగన్న మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలు, డీఎలు, పీఆర్‌సీ అంశాలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.



