సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా

సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా

తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. లోగో అంశంలో వివాదం నడవడంతో రేవంత్ సర్కార్.. కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరణకు రెడీ అవుతోంది. 

 

Read More హెచ్చరిక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం - భద్రాచలం

తెలంగాణ ఉద్యమ పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా కొత్త లోగోను ఆవిష్కరించాలని సర్కార్ నిర్ణయించింది. కానీ, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. చార్మినార్, వరంగల్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన చేపట్టారు. అటు, బోయిన్ పల్లి వినోద్ ఆధ్వర్యంలో వరంగల్ లో కూడా కాకతీయ కళాతోరణం దగ్గర ఆందోళన జరిగింది. కుట్రలో భాగంగానే లోగోలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది.