ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం
- ఎమ్మెల్యే మురళి నాయక్
విశ్వంభర,నెల్లికుదురు: ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతోందని, బడుగు బలహీన వర్గాలకు గూడు, తినడానికి కూడు కోసం సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు.నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కడారి వెంకన్న శోభ దంపతుల నూతన ఇల్లును స్థానిక సర్పంచి కత్తుల కళ్యాణి యాకయ్య, తహసిల్దార్ చంద నరేష్,ఎంపీడీవో సింగారపు కుమార్,ఎస్సై రమేష్ బాబు,తదితరులతో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్ శుక్రవారం గృహప్రవేశం పురస్కరించుకొని రిబ్బన్ కట్ చేసి ప్రవేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. మొదటి విడత ఇండ్లు నిర్మించని వారు వెంటనే కట్టుకోవాలని లేనిపక్షంలో వేరే వారికి కేటాయిస్తారన్నారు. ఏప్రిల్ నుంచి 2వ,విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయనున్నట్లు తెలిపారు. రావిరాల వరద ప్రభావితంతో ఇబ్బందులకు గురయిందని 50 ఇండ్లు అదనంగా ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందన్నారు.ఇండ్లు లబ్ధి పొందిన కొందరు ఇటీవల జరిగిన ఎన్నికలలో వ్యతిరేకంగా పనిచేయడం సరైనది కాదన్నారు. రానున్న ఎలక్షన్లలో మంచి చేసే ప్రభుత్వానికి,కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్నిచోట్ల గెలిపించాలన్నారు.కడారి వెంకన్న శోభ దంపతులు ఎమ్మెల్యేతో పాటు అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీవో పద్మ, ఉపసర్పంచి ఆరె తరుణ్,వార్డు సభ్యులు సూర్య ప్రకాష్ కడారి వెంకటమర్లు కత్తుల కుమార్ కడారి శ్రీకాంత్ వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ నాయకులు వీరన్న,ప్రభాకర్ గౌడ్, బాలాజీ నాయక్, మధు, అశోక్,ప్రశాంత్,శ్రీను,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



