సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంభర,నెల్లికుదురు: రావిరాల గ్రామం వరద ప్రమాదానికి గురైందని ఈ గ్రామ అభివృద్ధికి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువేనని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు.ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15 లక్షలతో గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్ల పనులను స్థానిక సర్పంచి కత్తుల కళ్యాణి యాకయ్య, తహసిల్దార్ నరేష్,ఎంపీడీవో కుమార్, ఎంపీ ఓ పద్మలతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, గ్రామంలో వరద సమయంలో రోడ్లు కొట్టుకపోయాయని,ఇండ్లు కూలాయని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు.ఏప్రిల్ నుంచి కేటాయించే ఇందిరమ్మ 2వ,విడత ఇండ్లలో గ్రామానికి అదనంగా 50 ఇండ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఫ్రైడే డ్రైడే సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. రావిరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పాత గోలెం లోని నిలువ ఉన్న నీటిని ఆయన పారపోశారు. పరిసరాలలో మురుగు గుంతలు ఉండకుండా చూసుకోవాలన్నారు.పాత పాత్రలలో నీరు నిల్వ ఉంటే దోమల వ్యాప్తి పెరిగి పలు రకాల జ్వరాలు, జబ్బులు వస్తాయన్నారు.అందుకే ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆరె తరుణ్, వార్డు సభ్యులు సూర్యప్రకాష్,కడారి వెంకట మల్లు,కుమార్,శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు వీరన్న, ప్రభాకర్ గౌడ్, బాలాజీ నాయక్, ప్రశాంత్,మధు,శ్రీను,అశోక్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



