కరెన్సీ పై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలి 

కరెన్సీ పై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలి 

విశ్వంభర, బషీర్ బాగ్: కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని తెలుగు ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద.. 'ఢిల్లీపై దండోరా మహాధర్నా' నిర్వహించారు. తెలుగు ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, వెంకట సత్యనారాయణ, ఈటెల  రాజేందర్, కలిశెట్టి, అప్పలనాయుడు, మల్లు రవి, ఓబీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గౌడ్ కిరణ్కుమార్, సీఏపీఎస్ఎస్ ఏపీ అధ్యక్షుడు కంఠ వేణు, తైకొండ శీను హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ,  అంబేడ్కర్ లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని, ఆయన ఫొటో ముద్రించకపోవడం అంటే చరిత్రను విస్మరించడమేనన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు. మల్లు రవి మాట్లాడుతూ,  ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు మాట్లాడుతూ,  ఈ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి లేఖ రాశానని  తెలిపారు.

Tags: