కొండిగారి రాములుకు సబితా రెడ్డి  నివాళులు 

కొండిగారి రాములుకు సబితా రెడ్డి  నివాళులు 

విశ్వంభర, మహేశ్వరం : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండి గారి రాములు  భౌతిక కాయానికి పూలమాల వేసి  మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, కొండిగారి రాములు  రెండుసార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా సేవలందించారని పేర్కొన్నారు, ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం మండలాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు,ఇలాంటి నాయకుడు ఇక మన మధ్య లేదన్న   విషయం నమ్మలేకపోతున్నాం, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, అలాగే వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , భువనగిరి ఎంపీ కాంటెస్టెడ్ క్యమ మల్లేష్  తదితరులు పాల్గొన్నారు.

Tags: