స్టైఫండ్ పెంపును అమలు చేయాలి
- విద్యార్థుల ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ మద్దతు
విశ్వంభర, శంషాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పి.జి, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ విద్యార్థుల సైఫండ్ పెంపు అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం స్టైఫండ్ పెంపు కోసం జీ.వో. ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదని అగ్రీకల్చర్ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు సైఫండ్ పెంపు కోసం చేపట్టిన నిరసనలకు ( ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ అన్నారు. ఈ సందర్భంగా కె వై ప్రణయ్ మాట్లాడుతూ, పరిశోధన విద్యార్థులు ఉన్నత విద్యా రంగానికి ముఖ్యమైన బలంగా ఉంటారు. దేశంలో విజ్ఞాన,సాంకేతిక అభివృద్ధి, సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపడంలో పరిశోధనలకు కీలక పాత్ర ఉంది. కానీ పరిశోధన చేస్తున్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, వసతి, ఆహారం, పరిశోధన ఖర్చులు వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుత సైఫండ్ సరిపోవడం లేదన్నారు. దీంతో అనేక మంది ప్రతిభావంతమైన విద్యార్థులు పరిశోధనను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పి.జి. ,పీహెచ్‌డీ విద్యార్థుల సైఫండ్ కోసం ,అగ్రీకల్చర్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు ఇవ్వాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ న్యాయసమ్మతమైనది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదు. ప్రభుత్వంకు అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు అమరణ నిరహర దీక్షలు చేస్తున్నారు, యూనివర్శీటీ అధికారులు,కానీ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో వారు బిల్డింగ్ ఎక్కి నిరసన చేస్తున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని, వ్యవసాయ యూనివర్శీటీని అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులతో చర్చలు జరిపి సైఫండ్ పెంపు నిర్ణయాన్ని ప్రకటించాలి. అలాగే పరిశోధన విద్యార్థులకు సమయానికి సైఫండ్ విడుదల చేయడం, హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచడం, పరిశోధనకు అవసరమైన వనరులను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. పరిశోధన విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని కేవై ప్రణయ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధక్షులు రామ్ మోహన్, నాయకులు గటయ్యా, భాస్కర్, చుక్క మోహన్ ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్, తనిష్, కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.



