వైద్య శిబిరానికి విశేష స్పందన

వైద్య శిబిరానికి విశేష స్పందన

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ జిల్లా  4వ డివిజన్ పరిధిలోని దుర్గా కాలనీ రోడ్ నంబర్ 1 లో హనుమకొండ జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు 4 వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గొర్రె ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీ శరణ్య హాస్పిటల్ వైద్యుల సహకారంతో నిర్వహించిన రెండో విడత ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఓం ప్రకాష్ మీడియాకు తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్క పేషెంట్ కు శరణ్య హాస్పిటల్ నందు ఒక సంవత్సరం వరకు ఉచిత ఓపి ఉంటుందని తెలిపారు అదేవిధంగా పేషెంట్ కు 20 శాతం  రాయితీ కూడా ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ బిజెపి నాయకులు,  వైద్య బృందం,  తదితరులు పాల్గొన్నారు.

Tags: