పోచమ్మ దేవి ఉత్సవాలు 

పోచమ్మ దేవి ఉత్సవాలు 

 విశ్వంభర,పెద్ద శంకరంపేట:పెద్ద శంకరంపేట పట్టణ శివారులోని తిరుమలాపూర్ లో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవి అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ. పుణ్యాహవాచనం. పంచగవ్య నిధి రక్షాబంధనం రుత్విక్ వరణం యాగశాల ప్రవేశం తదితర ప్రత్యేక పూజలు వేద బ్రాహ్మణ పండితుల మంత్రచారులతో నిర్వహించారు. ప్రత్యేకంగా హోమం ఆవాహిత దేవత హవనములు జలాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 14వ తేదీన గణపతి పూజ తదితర కార్యక్రమాలు. ఈనెల 15వ తేదీన అమ్మవారి యంత్ర ప్రతిష్ట మహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు విగ్రా o సుజాత.  రాజన్ గౌడ్ అధిక సంఖ్యలో భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags: