శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
- రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: శుక్రవారం ఇమాంపేట కేజీ విబి పాఠశాలలో విద్యార్థినిలు కోతులతో ఇబ్బంది పడుతున్నారని స్ప్రెడ్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి సహకారంతో లక్ష ఇరవై వేల వ్యాయంతో మంకీ ప్రొటెక్షన్ గ్రీల్స్ నిర్మించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినిల భద్రతను దృష్టిలో పెట్టుకొని గ్రీల్స్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల విద్యాలయం దత్తత తీసుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. కలెక్టరు పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు ఇవ్వడం జరిగిందని వాటిని విద్యార్థినిలకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విద్య, వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. విద్యార్థినిలు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, జి సి డి ఓ పూలన్ దేవి, అంజయ్య ,స్కూల్ ప్రిన్సిపాల్ డి నారాయణమ్మ, ఉపాధ్యాయులు సోనా బేగం, షాహినా బేగం, కాంచన, రాధిక, దేవి, దుర్గ భవాని, జ్యోతి, నిర్మల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



