మహిళా సాధికారతకు కృషి చేయాలి
On
విశ్వంభర, ముషీరాబాదు : కుమ్మరి మొల్ల స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి మహిళా సాధికారత సాధనకు కృషి చేయాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అన్నారు. హైదరాబాదు ట్యాంక్ బండ్ పై తెలుగు కవయిత్రి విగ్రహం వద్ద మొల్ల జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణాన్ని తెలుగులో సామాన్య ప్రజలకు అర్థమయ్యే లా రచించిన తొలి తెలుగు మహాకవయిత్రి మొల్ల అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి అనిల్ కుమార్, తీగుళ్ల యాదగిరి, బండారు బిక్షపతి, ధరిపెల్లి మహేందర్ ,నారాయణ, ఎసిపి శ్రీనివాస్, బాడిస వీరబాబు, వెలిజాల మల్లేష్, బొడ్డుపల్లి సత్యం రాజు తదితరులు పాల్గొన్నారు.



