ఘనంగా మొల్లమాంబ జయంతి
On
విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కుమ్మర సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి తెలుగు అనువాద రచయిత్రిగా, తాను రాసిన రామాయణం మొల్ల రామాయణంగా జనబాహుళ్యంలో పేరొందిన మొల్లమాంబ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు .కుమ్మర కులబాంధవులకు మొల్లమాంబ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేశారు. రామన్నపేట మండల అధ్యక్షుడు ఊట్కూరి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం రాజకీయ విభాగం మండల అధ్యక్షులు ఊట్కూరి నరసింహ, పట్టణ అధ్యక్షులు ఊట్కూరి సత్యనారాయణ, ఊట్కూరి కృష్ణ, ఊట్కూరి విజయ్, ఊట్కూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.



