ఇఫ్తార్ విందులో పాల్గొన్న సబితా రెడ్డి
On
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉపవాసం ముగించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నవీన్, గ్రామ పెద్దలు , పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



