నిబంధనలు పాటించాలి
On
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ప్రభుత్వనిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పేట పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఎవరు గుంపులుగా గుమి కూడ వద్దని నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు రోజులలో మండల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు తప్పనిసరిగా మూసి వేయవలసిందిగా ఆదేశించారు. పోలీస్ శాఖకు సహకరించి అన్ని జిరాక్స్ కేంద్రాల యజమానులు సహకరించాలని పేర్కొన్నారు.



