టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడికి సన్మానం
On
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సి విభాగం అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ ని ఇల్లంతకుంట సర్పంచ్ యం.రాజు ఆధ్వర్యం లో ఘనంగా సన్మానించారు. శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున సంక్షేమ కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతి పేదవాడికి చేరేలా తనవంతు కృషి చేస్తా అని సర్పంచ్ రాజు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఐలయ్య పాల్గొనారు.



