హామీలన్నీ నెరవేర్చుతాం: లక్ష్మారెడ్డి

హామీలన్నీ నెరవేర్చుతాం: లక్ష్మారెడ్డి

విశ్వంభర, మహేశ్వరం :  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జల్ పల్లి, ఫహాడిషరీప్ షహీన్‌నగర్‌ డివిజన్లను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో కె ఎల్ ఆర్   మాట్లాడుతూ, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ రూ.500, పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం సహా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు,వచ్చే జి హెచ్ ఎం సి   ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి  కోరారు.

Tags: