బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సురేఖ 

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సురేఖ 

విశ్వంభర,హైదరాబాద్ : ఇందూరు తిరుమలగా ప్రసిద్ధి చెందిన గోవింద వనమాల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఆలయ అర్చకులు మంత్రిని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మంత్రి వీక్షించారు. భక్తులతో కలిసి స్వామివారి సేవలను దర్శించుకున్న మంత్రి, ఆలయ సంప్రదాయాలు మరియు నిర్వహణపై అర్చకులు, నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇందూరు తిరుమలగా పేరుపొందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ ప్రాంతీయంగా ప్రముఖ ధార్మిక కేంద్రంగా ఎదుగుతుండటం ఆనందకరమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు, నుడా చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు, నిర్వాహకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: