కస్టమర్లకు జ్యువెలర్స్ లక్కీ డ్రా
On
విశ్వంభర, హైదరాబాద్ : ధన్ రాజ్ జ్యుయలర్స్ కొనుగోలుదారులను ఆకట్టుకొనేలా ఫెస్టివ్ లక్కీ డ్రా-26ను ప్రకటించింది. ఈ పండుగ సీజన్ లో కస్టమర్లకు రూ.30 లక్షల వరకు విలువైన బహుమతులు గెలుచుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ధనరాజ్ జైన్ జ్యుయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధురువ్ రంకా తెలిపారు. ఈ ఫెస్టివ్ లక్కీ డ్రా ఏప్రిల్ 4వరకు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ శాలిబండలో ఉన్నధన్ రాజ్ జ్యుయలర్స్ షోరూమ్లో కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని తెలిపారు. విజేతలకు మారుతి సుజుకి ఎర్టిగా కారు, ఐదు అపాచీ బైక్లు, ఎల్జి వాషింగ్ మెషిన్లు, ఎల్జి టెలివిజన్లు, ఎల్జి ఫ్రిజ్లు, వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ అందజేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 5న హైదరాబాద్ చంపాపేటలోని ఎంవైఆర్ గార్డెన్స్ లో లక్కీడ్రా తీస్తారని వివరించారు.



