పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు  

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు  

  • ఎస్పీ  నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజలు గుంపులుగా చేరడంపై నిషేధ ఆజ్ఞలు అమలులో ఉంటాయని  జిల్లా ఎస్పి నరసింహ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు.

Tags: