మైసమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
On
విశ్వంభర, చింతపల్లి: మండల కేంద్రంలో ఉన్న శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ మాత ఆలయంలో జరుగుతున్న జాతరలో శుక్రవారం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతపల్లి శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ మాత వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి దయ, కరుణా, కటాక్షాలతో శాంతి, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ పూజారి గండికోట శేఖర్ మాజీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వింజమూరి రవి, మాజీ మండల అధ్యక్షులు ఎల్లెంకి అశోక్, మైనారిటీ నాయకులు ఖాలేద్, సీనియర్ నాయకులు ఉప్పల యాదయ్య, చెనమోని అంజిబాబు తదితరులు పాల్గొన్నారు



