వివాహ వేడుకల్లో పాల్గొన్న రాజేశ్వర్ రెడ్డి
On
విశ్వంభర, సిద్దిపేట: యువ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి కొండపాక, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, నంగునూర్ మండలాల్లోని పలు వివాహాది శుభాకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్‌లో బక్కని భాస్కర్ చెల్లెలె రేవతి, రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన ద్యావర దుర్గాప్రసాద్ కూతురు శ్రీజ, రాఘవాపూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి ఎల్లయ్య కూతురు ప్రవళిక, నారాయణరావుపేట మండలంలోని కోదండరావుపల్లి గ్రామానికి చెందిన తేజశ్విని వివాహా వేడకల్లో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.



