విద్యార్థులకు వేం కుటుంబం మద్దతు
On
విశ్వంభర, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం వేం కుటుంబం ఆదర్శంగా నిలిచింది. వారి కుటుంబం సభ్యులు వేం పురుషోత్తం రెడ్డి జ్ఞాపకార్థం ఆయన మనవళ్లు వేం అర్ణవ్ కృష్ణ రెడ్డి, అవ్యాన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ. 10,000 విరాళం అందించారు.ఈ విరాళం ద్వారా గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న 10వ తరగతి ప్రత్యేక తరగతులు లో విద్యార్థులకు ప్రతి రోజు స్నాక్స్, పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, పెన్నులు వంటి విద్యా సామగ్రి అందజేశారు. విద్యార్థుల చదువును ముందుకు తీసుకెళ్లడానికి వేం కుటుంబం చేసిన సేవ విద్యార్థుల కు గుర్తు ఉండిపోతుంది.



