రోడ్డు నిబంధనలు పాటించాలి 

 విశ్వంభర, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో గల మాంగల్య షాపింగ్ మాల్ ఉద్యోగులకు రోడ్డు నియమాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత ప్రమాదాల నివారణకు సంబంధించిన సూచనలు చేసారు. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, సూర్యాపేట పట్టణ ఎస్సై ఏడుకొండలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భద్రతా కార్యక్రమాలలో భాగంగానే రోడ్ అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనదారులను ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నివారణకు అవగాహన నియమాలు పాటించడమే ప్రధాన మార్గమని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని తప్పుడు మార్గంలో వాహనాలు నడపకూడదని ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటకూడదని సూచించారు.

Tags: