పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

  • మండల విద్యాధికారి శేఖర్

విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట మండలంలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి వెన్ను శేఖర్  శుక్రవారం తెలిపారు. పెద్ద శంకరంపేటలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 207 మంది విద్యార్థులు,  జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 220 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కారునట్లు ఆయన వివరించారు. మండలంలో మొత్తం 427 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకానున్నారని ఆయన వివరించారు. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట కన్నా ముందే చేరుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Tags: