16న స్పోర్ట్స్ స్కూల్స్ కు ఎంపిక
విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న,మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని నెల్లికుదురు ఆంగోతు రాందాస్, ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురు లో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై స్కూల్ గ్రౌండ్ లో పోటీలు జరగనున్నాయి.3వ,తరగతి చదువుతూ 8 నుంచి 9సం.ల మధ్య వయస్సు ఉన్న బాల,బాలికలకు 2026-27 విద్యా సంవత్సరానికి 4వతరగతి ప్రవేశాల కోసం సంబంధిత పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్,పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, డేట్ అఫ్ బర్త్,3వ,తరగతి ప్రోగ్రెస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి పత్రాల తో ఆయా పాఠశాలల్లో ఉ.9 గం.కు హాజరు కావాలని సూచించారు.మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈ నెల 28న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలోపి.డి లు చెడుపల్లి ఐలయ్య, తాళ్ల ప్రణయ్,ఇమామ్, ప్రవీణ్,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.



